హెల్త్ బులెటిన్: తెలంగాణలో నేడు భారీగా నమోదైన కేసులు..!

Wednesday, August 26th, 2020, 10:30:01 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,018 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,060 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 25,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 780 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 61,040 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,82,094 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 76.30 శాతం ఉండగా, మరణాల రేటు 0.69% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.