కరోనా అప్డేట్: భారత్‌లో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..!

Thursday, September 10th, 2020, 11:22:39 AM IST

india_corona

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో ఏకంగా 95,735 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,65,864 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,19,018 యాక్టివ్ కేసులు ఉండగా, 34,71,783 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 75,062 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 72,939 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,29,756 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.74 శాతం ఉండగా, మరణాల రేటు 1.68 శాతంగా ఉంది.