కరోనా అప్డేట్: భారత్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..!

Friday, September 4th, 2020, 11:29:32 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో ఏకంగా 83,341 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,36,747 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,31,124 యాక్టివ్ కేసులు ఉండగా, 30,37,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1096 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 68,472 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 66,659 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,69,765 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.1 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.