కరోనా అప్డేట్: భారత్‌లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు..!

Thursday, September 3rd, 2020, 11:27:27 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 ఏకంగా 83,883 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,53,406 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,15,538 యాక్టివ్ కేసులు ఉండగా, 29,70,492 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1043 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 67,376 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 68,584 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,72,179 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.1 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.