భారత్‌లో కరోనా కల్లోలం.. నేడు భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు..!

Wednesday, September 2nd, 2020, 11:08:58 AM IST

india_corona

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 ఏకంగా 78,357 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37,69,523 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,01,282 యాక్టివ్ కేసులు ఉండగా, 29,01,908 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1045 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 10,12,367 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.