భారత్‌లో 32 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే?

Wednesday, August 26th, 2020, 11:30:51 AM IST

india_corona

భారత్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఓ పక్క రికవరీ రేటు పెరుగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,34,474 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,07,267 యాక్టివ్ కేసులు ఉండగా, 24,67,758 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1059 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 59,449 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,23,992 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.03 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.