భారత్‌లో రికార్డ్ స్థాయిలో నమోదైన కొత్త కరోనా కేసులు..!

Thursday, August 20th, 2020, 11:00:21 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు, మరణాలు రెండు రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. ఓ పక్క రికవరీలు పెరుగుతున్నా మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దేశ వ్యాప్తంగా 69,652 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,36,926 కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 6,86,395 యాక్టివ్ కేసులు ఉండగా, 20,96,665 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 977 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 53,866కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 9,18,470 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 73.9 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.