భారత్‌లో కరోనా మరణ మృదంగం.. నేడు వెయ్యికి పైగా మరణాలు..!

Thursday, August 27th, 2020, 11:41:42 AM IST

భారత్‌లో కరోనా విళయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 75,760 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,10,234 కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 7,25,991 యాక్టివ్ కేసులు ఉండగా, 25,23,771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1023 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 60,472 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 9,24,998 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.02 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.