బిగ్ అప్డేట్: దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు..!

Friday, August 28th, 2020, 11:18:40 AM IST

india_corona

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 77,266 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,87,501 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,42,023 యాక్టివ్ కేసులు ఉండగా, 25,83,948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1057 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 61,529 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 9,24,998 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.02 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.