తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు షురూ..!

Tuesday, September 1st, 2020, 08:30:24 AM IST

కరోనా కారణంగా ఇప్పట్లో విద్యా సంస్థలు తెరిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు పాఠాలు భోదించనున్నారు.

అయితే దూరదర్శన్, టీ-శాట్ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు క్లాసులు చెప్పబోతున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు టైమ్ ఉదయం 8 గంటల నుంచి 10.30వరకు అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ తరగతులు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ క్లాసులు ఉంటాయని ఒక్కో క్లాసు 30 నిమిషాలు ఉంటుందని విద్యార్థులంతా ఈ టీవీ క్లాసులు చూసే బాధ్యత టీచర్లదేనని విద్యాశాఖ తెలిపింది.