నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. గెలుపు ఎవరిదో?

Friday, October 9th, 2020, 07:26:29 AM IST

నేడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఓటర్లకు టెంపరేచర్ టెస్ట్‌లు, మాస్కు, గ్లౌజులు తప్పనిసరి అని సూచించారు.

అయితే 24 మంది ఓటర్లకు కరోనా ఉందని ముందుగానే నిర్ధారించుకున్న అధికారులు వారికి చివరి గంటలో ఓటు వేసే అవకాశం కల్పించారు. కరోనా బాధితుల కోసం పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లను అధికారులు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా న్నికల బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతన్‌కర్ లక్ష్మీనారాయణలు ఉన్నారు. అయితే దాదాపు టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత విజయం ఇక్కడ ఖాయంగా కనిపిస్తుంది.