నేడు విశాఖలో విజయసాయి రెడ్డి పాదయాత్ర.. రూట్‌మ్యాప్ సిద్దం..!

Saturday, February 20th, 2021, 08:35:52 AM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు విశాఖపట్నంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో దానికి వ్యతిరేకిస్తూ కార్మికులకు మద్దతుగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. విశాఖలోని జీవీఎంసీ నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు 22 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరగబోతుంది.

అయితే ఈ పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఆశీల్ మెట్ట, కంచరపాలెం, ఎన్ఏడి, షీలానగర్, గాజువాక మీదుగా ఈ పాదయాత్ర జరగబోతున్నది. అటు విజయసాయి చేపట్టనున్న ఈ పాదయాత్రకు ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ఇస్తుండగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.