నేడే కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. పంపిణీకి సర్వం సిద్ధం..!

Saturday, January 16th, 2021, 07:45:49 AM IST

యావత్ దేశమంతా ఉత్కంఠగా దేనికోసం ఎదురుచూస్తుందో ఆ ఘడియలు రానే వచ్చేశాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా కరోనా టీకా డ్రైవ్‌ను ప్రారంభించబోతున్నారు. అనంతరం టీకా తీసుకున్న వారితో ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. అయితే తొలిరోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించనున్నట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా మొత్తం 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, మరోవైపు తొలిరోజు ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి టీకాను ఇవ్వబోతున్నారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచనున్నట్టు తెలుస్తుంది. తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.