టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ కానున్న సీఎం కేసీఆర్.. కారణం అదే..!

Thursday, September 10th, 2020, 08:30:58 AM IST

KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఎంపీలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 14 నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాలలో భాగంగా ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురుంచి ఎంపీలకు తెలియచేయనున్నారు. అంతేకాదు కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరై వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.