నేడు తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. డిక్లరేషన్ ఇస్తాడా?

Wednesday, September 23rd, 2020, 08:30:03 AM IST

ఏపీ సీఎం జగన్ నేడు తిరుమలలో పర్యటించనున్నారు. ఇవాళ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోబోతున్న సీఎం జగన్ రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 6:15 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం శ్రీవారి గరుడ సేవలో పాల్గొననున్నారు.

అయితే తిరిగి 24న ఉదయం సీం జగన్ స్వామివారిని దర్శించుకుని అనంతరం కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రేణిగుంట నుంచి గన్నవరంకు సీఎం జగన్‌ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం తిరుమలకు వచ్చే అన్యమతస్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నారు. మరీ ఈ నేపధ్యంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకుంటాడా లేక నేరుగా దర్శనానికి వెళ్తాడా అనేది ఆసక్తిగా మారింది.