నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్..!

Tuesday, September 22nd, 2020, 07:35:30 AM IST

Modi_Jagan

ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలకు పైగా ఎలాంటి పర్యటనలు పెట్టుకోని సీఎం జగన్ నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఇందులో భాగంగా సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2:50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం 5:00 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.

అయితే సాయంత్రం ప్రధాని మోదీనీ కలిసి ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు మరియు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాల గురుంచి చర్చించనున్నారు. అయితే మోదీ భేటీ తర్వాత సీఎం జగన్ హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. కాగా రేపు ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తిరిగి బుధవారం ఉదయం అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.