ఏపీలో కరోనా మరణ మృదంగం.. గడిచిన 24 గంటల్లో 93 మంది మృతి..!

Sunday, August 23rd, 2020, 06:14:35 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 46,712 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,895 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 93 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని నేడు 7,449 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,53,111 కి చేరగా అందులో 89,742 మంది చికిత్స పొందుతుండగా, 2,60,087 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,282 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32,38,038 శాంపిల్స్ పరీక్షించారు.