కరోనా అప్డేట్: భారత్‌లో కొత్తగా మరో 85,362 పాజిటివ్ కేసులు..!

Saturday, September 26th, 2020, 11:28:25 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 85,362 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,932 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,60,969 యాక్టివ్ కేసులు ఉండగా, 48,49,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,089 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 93,379 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 93,420 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,41,535 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 82.1 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.