కరోనా అప్డేట్: భారత్‌లో 45 లక్షలు దాటిన కరోనా కేసులు..!

Friday, September 11th, 2020, 11:16:39 AM IST

india_corona

భారత్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో ఏకంగా 96,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,62,415 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,43,480 యాక్టివ్ కేసులు ఉండగా, 35,42,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,209 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 70,880 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,63,542 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.6 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.