దేశంలో మునుపటి రికార్డులు బ్రేక్ చేసిన కరోనా కేసులు..!

Saturday, September 12th, 2020, 01:30:09 PM IST

india_corona

భారత్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే రోజూ మునుపటి రికార్డులను బ్రేక్ చేస్తూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో ఏకంగా 97,570 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,59,984 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,58,316 యాక్టివ్ కేసులు ఉండగా, 36,24,196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,201 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 81,533 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,91,251 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 77.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.