ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నేడు మరో 82 మంది మృతి..!

Thursday, August 13th, 2020, 04:58:45 PM IST

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతొనే ఉంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 55,692 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,996 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 82 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,142కి చేరగా అందులో 90,840 మంది చికిత్స పొందుతుండగా, 1,70,924 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,378కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,05,459 శాంపిల్స్ పరీక్షించారు.