ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 993 పాజిటివ్ కేసులు..!

Tuesday, March 30th, 2021, 07:24:38 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తుంది. కొద్ది రోజుల నుంచి మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలోకి వచ్చింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 30,851 శాంపిల్స్‌ని పరీక్షించగా 993 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,00,805 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 6,614 మంది చికిత్స పొందుతుండగా 8,86,978 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 480 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,213కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,52,215 శాంపిల్స్ పరీక్షించారు.