ఏపీలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Friday, March 26th, 2021, 11:24:31 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలోకి వచ్చింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 40,604 శాంపిల్స్‌ని పరీక్షించగా 984 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన మరో ఇద్దరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,863 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 4,145 మంది చికిత్స పొందుతుండగా 8,85,515 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 306 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,203కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,49,16,201 శాంపిల్స్ పరీక్షించారు.