తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..!

Monday, August 3rd, 2020, 10:46:37 AM IST

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో 983 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు 11 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 1019 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660 చేరగా, కరోనా నుంచి కోలుకుని 48,609 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 551కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 9,443 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 4,87,238 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 71.8 శాతంగా ఉందని, మరణాల రేటు 0.81 శాతంగా ఉందని హెల్త్ బులెటిన్ తెలిపింది.