కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా మరో 947 పాజిటివ్ కేసులు..!

Saturday, March 27th, 2021, 10:42:17 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. మళ్ళీ రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలోకి వచ్చింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 42,696 శాంపిల్స్‌ని పరీక్షించగా 947 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ఒక్కరు కూడా మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,97,810 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 4,715 మంది చికిత్స పొందుతుండగా 8,85,892 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 377 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,203కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,49,58,897 శాంపిల్స్ పరీక్షించారు.