తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 6 మంది మృతి..!

Monday, June 1st, 2020, 09:15:17 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత వారం రోజులుగా వందకు పైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా నేడు కూడా 94 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే నేడు కరోనా బారిన పడి 6 మంది చనిపోయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు, రంగారెడ్డి మరియు మేడ్చల్‌లో 3 కేసులు, మెదక్, సంగారెడ్డి మరియు నల్గొండలో 2 కేసులు, మహబూబాబాద్, జనగాం, పెద్దపల్లిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. అయితే నేడు వలస కూలీలలో, విదేశాల నుంచి వారిలో ఎవరికి కరోనా పాజిటివ్ రాలేదు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,792కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 1491 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 1213 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది.