భారత్‌లో 54 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు కొత్తగా ఎన్నంటే?

Sunday, September 20th, 2020, 11:07:38 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 92,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,00,619 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 10,10,824 యాక్టివ్ కేసులు ఉండగా, 43,03,043 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,233 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 86,752 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 94,612 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,06,806 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 79.28 శాతం ఉండగా, మరణాల రేటు 1.61 శాతంగా ఉంది.