భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 86,821 పాజిటివ్ కేసులు..!

Thursday, October 1st, 2020, 11:28:19 AM IST

భారత్‌లో కరోనా కేసులు సంఖ్య నాలుగు రోజుల నుంచి కాస్త తగ్గుతుందని భావించినా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 86,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 1,181 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,12,584 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,40,705 యాక్టివ్ కేసులు ఉండగా, 52,73,201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 98,678 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 85,376 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,23,052 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 83.5 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.