భారత్‌లో ఆగని కరోనా కేసులు.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Thursday, September 24th, 2020, 10:10:11 AM IST

india_corona

భారత్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 86,508 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,519 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,66,382 యాక్టివ్ కేసులు ఉండగా, 46,74,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,129 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 91,149 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 89,746 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,53,683 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 81.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.