ఏపీలో ఆగని కరోనా కేసులు.. నేడు మరో 84 మంది మృతి..!

Sunday, August 16th, 2020, 07:42:10 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 48,746 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,012 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 84 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 10,117 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,829 కి చేరగా అందులో 85,945 మంది చికిత్స పొందుతుండగా, 2,01,234 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,650కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,60,943 శాంపిల్స్ పరీక్షించారు.