కరోనా అప్డేట్: భారత్‌లో కొత్తగా నేడు ఎన్ని కేసులంటే?

Thursday, October 8th, 2020, 10:39:04 AM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 78,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 971 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,35,655 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,02,425 యాక్టివ్ కేసులు ఉండగా, 58,27,704 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,05,526 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 83,011 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,94,321 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 85.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.