ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉదృత్తి.. నేడు ఎన్ని కేసులంటే?

Sunday, September 20th, 2020, 07:30:57 PM IST

ఏపీలో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 70,455 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,738 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 57 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని నేడు 10,608 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,514 కి చేరగా అందులో 78,836 మంది చికిత్స పొందుతుండగా, 5,41,319 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 5,359 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,04,131 శాంపిల్స్ పరీక్షించారు.