భారత్‌లో కరోనా విళయతాండవం.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Saturday, August 29th, 2020, 12:31:09 PM IST

భారత్‌లో కరోనా విళయతాండవం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 76,472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,63,972 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,52,424 యాక్టివ్ కేసులు ఉండగా, 24,48,998 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1021 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 62,550 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 9,28,761 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.05 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.