భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా నేడు ఎన్నంటే?

Tuesday, September 22nd, 2020, 11:18:52 AM IST

india_corona

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తుంది. ప్రతి రోజు దాదాపు లక్ష కేసులు నమోదవుతున్న తరుణంలో ఆ సంఖ్య మెల్ల మెల్లగా తగ్గుతూ 75 వేలకు చేరింది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 75,083 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,663 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,75,861 యాక్టివ్ కేసులు ఉండగా, 44,97,867 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,053 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 88,935 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,33,185 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 80.9 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.