భారత్‌లో ఆగని కరోనా కేసులు.. నేడు కొత్తగా 73,272 కేసులు..!

Saturday, October 10th, 2020, 11:43:34 AM IST

భారత్‌లో కరోనా ప్రభావం తగ్గడం లేదు. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త బెటర్ అనిపించినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 73,272 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 926 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 69,79,424 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,83,185 యాక్టివ్ కేసులు ఉండగా, 59,88,822 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,07,416 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 82,753 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,64,018 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 85.81 శాతం ఉండగా, మరణాల రేటు 1.54 శాతంగా ఉంది.