ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా మరో 7,224 పాజిటివ్ కేసులు..!

Saturday, April 17th, 2021, 11:00:49 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 35,907 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,224 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 15 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,55,455 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 40,469 మంది చికిత్స పొందుతుండగా 9,07,598 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 2,332 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,388కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,56,42,070 శాంపిల్స్ పరీక్షించారు.