భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Monday, October 12th, 2020, 11:36:40 AM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నేడు భారీగా తగ్గింది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 66,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 816 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 71,20,538 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,61,853 యాక్టివ్ కేసులు ఉండగా, 61,49,535 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,09,150 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 71,559 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,94,851 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 86.4 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.