కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా మరో 64 పాజిటివ్ కేసులు..!

Monday, February 1st, 2021, 06:18:07 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గిపోయింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 21,922 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 64 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన నేడు మరొకరు మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,900 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,242 మంది చికిత్స పొందుతుండగా 8,79,504 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 99 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,154 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,31,59,794 శాంపిల్స్ పరీక్షించారు.