భారత్‌లో మరింత విజృంభిస్తున్న కరోనా.. భారీగా పాజిటివ్ కేసులు..!

Saturday, March 27th, 2021, 01:32:20 PM IST

india_corona

భారత్‌లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడమే కాకుండా ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 62,258 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 291 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 4,52,647 యాక్టివ్ కేసులు ఉండగా, 1,12,95,023 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,61,240 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 30,386 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 94.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.