తెలంగాణలో కరోనా విజృంభణ.. నేడు భారీగా పెరిగిన కేసులు..!

Friday, May 22nd, 2020, 09:53:55 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. నేడు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు 62 కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు కూడా ముగ్గురు మృతి చెందగా, కోలుకుని ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు 42 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో ఒకరికి, వలస కూలీలలో 19 మందికి కరోనా సోకింది.

అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1761 కి చేరగా, 1048 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇటు మరణాల సంఖ్య మొత్తం 48కి చేరింది. అయితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న జనాలు మాత్రం కరోనాను తేలికగా తీసుకుంటూ యదేచ్చగా వారి వారి పనులలో నిమగ్నమైపోయారు.