భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు.. మళ్ళీ పెరిగిన మరణాలు..!

Sunday, October 18th, 2020, 12:55:17 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 61,871 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేడు మరణాల సంఖ్య మళ్ళీ ఒక్కసారిగా పెరిగింది. కరోనా కారణంగా 1033 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,551 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,83,311యాక్టివ్ కేసులు ఉండగా, 65,97,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,14,031 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 72,614 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,70,133 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 88 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.