ఏపీలో కొత్తగా మరో 618 కేసులు.. మరో ముగ్గ్గురు మృతి..!

Wednesday, December 9th, 2020, 09:00:46 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 61,038 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 618 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,457 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 5,259 మంది చికిత్స పొందుతుండగా 8,61,153 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 785 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,045 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,05,70,843 శాంపిల్స్ పరీక్షించారు.