భారత్‌లో ఆగని కరోనా కేసులు.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Tuesday, August 25th, 2020, 10:40:09 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఓ పక్క రికవరీ రేటు పెరుగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో 60,975 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,67,324 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,04,348 యాక్టివ్ కేసులు ఉండగా, 24,04,585 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 848 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 58,390 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 9,25,383 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 75.09 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.