హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 574 కరోనా కేసులు..!

Thursday, December 24th, 2020, 10:07:44 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ కనిపిస్తున్నా, కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ అందరిని కలవరపెడుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాపతంగా మరో 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో ఇద్దరు చనిపోయారు. ఇక కరోనా నుంచి నేడు మరో 384 మంది కోలుకున్నారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,556 కి చేరింది. ఇక ఇప్పటివరకు 2,75,217 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 6,815 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,524 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 44,516 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 66,11,118 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.05 శాతం ఉండగా, మరణాల రేటు 0.53% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.