ఏపీలో ఆగని కరోనా కేసులు.. నేడు మరో 35 మంది మృతి..!

Saturday, October 10th, 2020, 07:03:14 PM IST

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కాస్త తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 73,625 శాంపిల్స్‌ని పరీక్షించగా 5,653 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 35 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని నేడు 6,659 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,50,517 కి చేరగా అందులో 46,624 మంది చికిత్స పొందుతుండగా 6,97,699 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 6,194 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64,94,099 శాంపిల్స్ పరీక్షించారు.