కరోనా అప్డేట్: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Tuesday, October 13th, 2020, 10:17:25 AM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నేడు భారీగా తగ్గింది. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 55,342 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 706 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 71,75,880 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 8,38,729 యాక్టివ్ కేసులు ఉండగా, 62,27,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,09,856 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 77,760 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,73,014 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 86.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.