కరోనా అప్డేట్: ఏపీలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, November 23rd, 2020, 10:42:45 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 47,130 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 545 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,758 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 13,394 మంది చికిత్స పొందుతుండగా 8,42,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,390 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,948 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96,62,220 శాంపిల్స్ పరీక్షించారు.