హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 518 కరోనా కేసులు..!

Friday, December 25th, 2020, 01:24:12 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ కనిపిస్తున్నా, కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ అందరిని కలవరపెడుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 518 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో ముగ్గురు చనిపోయారు. ఇక కరోనా నుంచి నేడు మరో 491 మంది కోలుకున్నారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,074 కి చేరింది. ఇక ఇప్పటివరకు 2,75,708 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 6,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,527 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 44,869 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 66,55,987 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.05 శాతం ఉండగా, మరణాల రేటు 0.53% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.