ఏపీలో నేడు భారీగా నమోదైన కరోనా కేసులు..!

Tuesday, March 23rd, 2021, 10:24:46 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 33,634 శాంపిల్స్‌ని పరీక్షించగా 492 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత మూడు నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా బారిన మరో ఇద్దరు మృతి చెందారు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,536 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,616 మంది చికిత్స పొందుతుండగా 8,84,727 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,193కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,48,05,335 శాంపిల్స్ పరీక్షించారు.