కరోనా అప్డేట్: భారత్‌లో ఆగని కరోనా కేసులు, మరణాలు..!

Saturday, October 31st, 2020, 01:34:48 PM IST

భారత్‌లో కరోనా కేసులు, మరణాలు ఆగడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 48,268 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా కారణంగా 551 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 81,37,119 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 5,82,649 యాక్టివ్ కేసులు ఉండగా, 74,32,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,21,641 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 59,454 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,70,133 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 91.34 శాతం ఉండగా, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.